Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నర్సింహమూర్తికి రూ.1.75 లక్షల CMRF-LOC అందజేత

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 05:07 PM |
నర్సింహమూర్తికి రూ.1.75 లక్షల CMRF-LOC అందజేత

పేదలకు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి: వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన శ్రీ నర్సింహమూర్తికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,75,000 విలువైన LOC మంజూరి పత్రాన్ని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యవసర వైద్య చికిత్స సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని గాంధీ అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని తెలిపారు.

తమ కుటుంబ సభ్యుడి వైద్య చికిత్సకు రూ.1.75 లక్షల CMRF-LOC మంజూరు చేయించి సహకరించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు వినోద్ రావు, మిరియాల ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.