Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లింగంపల్లిలో 23 కిలోల గంజాయి పట్టివేత

Author
Posted By AKSHARA NETRAM
| 01 Oct 2026, 12:30 PM |
లింగంపల్లిలో 23 కిలోల గంజాయి పట్టివేత

ముంబైకి చెందిన ఇద్దరు అరెస్టు.. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడి
లింగంపల్లి: లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 23 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్ ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మొత్తం 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా మార్గాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.